
టాస్క్ ఫోర్స్ సోదాల వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
The story in brief
ఎఫ్ఐఆర్ లేకుండా టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన సోదాల గురించి వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తు, సోదాలను సవాలు చేస్తూ బొరబండకు చెందిన బి. బాలరాజు పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ టి. మాధవీదేవి మంగళవారం విచారణ చేపట్టారు. హోం శాఖ అధికారులకు, టాస్క్ ఫోర్స్ డిసిపిలకు నోటీసులు జారీ చేశారు. విచారణను డిసెంబర్ 15కి వాయిదా వేశారు.