Question Everything. See who's reporting it.

ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్ లైన్ పరీక్షలు ప్రారంభం

Source: V6 Velugu

The story in brief

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు నవంబర్ 20 నుంచి మిడ్ లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం పరిధిలో భాగంగా ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, తెలంగాణ మోడల్ స్కూల్స్, గురుకుల, కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లోని విద్యార్థులందరికీ వర్తిస్తాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి. రమేష్ ధృవీకరించారు. ప్రశ్నపత్రాలను పంపిణీ చేయాలని, డిసెంబర్ 10వ తేదీలోగా ఫలితాలను తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో నమోదు చేయాలని జిల్లా డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.

NEWXFree on Android and iPhone. Open in NEWX