
పవన్ స్పెషల్ ప్యాంట్స్ ఖరీదును వెల్లడించిన రేణు దేశాయ్
The story in brief
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ 'బాలు'లో పవన్ ధరించిన స్పెషల్ కార్గో ప్యాంట్స్ కథను పంచుకున్నారు. దీని ఖరీదు రూ. 75 వేలు. ఇది మిలన్లో తయారైంది. రెండవ ప్రపంచ యుద్ధం నాటి ఆర్మీ క్లాత్తో తయారు చేసిన ఈ ప్యాంట్స్ ప్రపంచవ్యాప్తంగా తయారైన ఐదు ప్యాంట్లలో ఒకటి. వీటిలో ఒకటి డేవిడ్ బెక్కామ్ కొనుగోలు చేయగా, మరొకటి పవన్ కోసం తయారు చేయబడింది. రేణు అడ్వాన్స్ చెల్లించి మూడు నెలలు ప్యాంట్ కోసం ఎదురు చూసింది.