
ఢిల్లీలో నార్త్ బ్లాక్ లో మంటలు
The story in brief
ఢిల్లీలోని నార్త్ బ్లాక్ ప్రాంతంలో సెంట్రల్ సెక్రటేరియట్ పైకప్పుకు మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. దీంతో ఆరు అగ్నిమాపక యంత్రాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. సెక్రటేరియట్ పైకప్పులోని ఏసీ బాయిలర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ తెలిపింది. చాలా దూరం నుండి పొగ కనబడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.