
హైదరాబాద్ స్క్రాప్ షాపులో పేలుడు
The story in brief
హైదరాబాద్ రామాంతపూర్ చర్చ్ కాలనీలోని స్క్రాప్ షాపులో లోహాన్ని కత్తిరిస్తుండగా పేలుడు సంభవించి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 70 శాతం కాలిన గాయాలతో తీవ్రంగా గాయపడిన స్క్రాప్ డీలర్ పరశురామ్ ను అత్యవసర పరిస్థితిలో గాంధీ ఆసుపత్రికి తరలించారు. షాపు నివాస భవనాల మధ్య ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.