
నవంబర్ 13న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైన డానీ మూవీ సెట్
The story in brief
రొమాంటిక్ అండ్ రస్టిక్ యాక్షన్ లవ్ స్టోరీ అయిన డానీ మూవీ నవంబర్ 13న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ చిత్రంలో యువ హీరో ఆశిష్ గాంధీ, దర్శకుడు కళ్యాణ్జీ గోగన నటించగా, సెజల్ గుప్తా హీరోయిన్ గా నటించారు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్ పై రిజ్వాన్ నిర్మించిన ఈ మూవీ రొమాన్స్, క్రైమ్, రస్టిక్ జానర్ల కలయికగా రూపొందింది. సోనల్ సింగ్, అజర్ ఖాన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం ట్రేడ్ సర్కిల్స్ లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది.