
పాలిటెక్నిక్ విద్యార్థులకు దసరా సెలవులు రెండు రోజులకు కుదించారు
The story in brief
దసరా సెలవులను కాంగ్రెస్ ప్రభుత్వం పది రోజుల నుండి రెండు రోజులకు తగ్గించడంతో పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 18 నుండి 21 వరకు సెలవులు ప్రకటించిన విద్యాశాఖ కేవలం రెండు రోజులు మాత్రమే ప్రత్యేక సెలవులుగా ప్రకటించింది. జీవో 97 వ్యవహారంలో విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలే దీనికి కారణమని అధ్యాపక సంఘాలు ఆరోపిస్తున్నాయి.