
మంగంపల్లిలో దళిత కుటుంబాన్ని ఆలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబాయి
The story in brief
మంగంపల్లి గ్రామంలో దళిత కుటుంబాన్ని ఆలయంలోకి వెళ్లనివ్వకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి బాబాయి వెంకటరాంరెడ్డి అడ్డుకున్నారు. వనపర్తి జిల్లా పెద్దామండడి మండలంలో దళిత కుటుంబం దర్శనం కోసం వెళ్లగా ఈ ఘటన జరిగింది. 'మేము ఈ ఆలయాన్ని కట్టాం... ఎలా వస్తారు?' అని దళిత వ్యక్తితో వెంకటరాంరెడ్డి వాగ్వాదానికి దిగారు. 'మీరు కట్టలేదు... విరాళాలు సేకరించి మేమంతా కట్టాం' అని దళిత వ్యక్తి బదులిచ్చారు. దళితులపై జరుగుతున్న వివక్షను ఎత్తి చూపుతూ ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.