
జోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి దేవాలయాలలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి.
The story in brief
ఐదవ శక్తిపీఠమైన జోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి దేవాలయాలలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. జోగులాంబ అమ్మవారు బ్రహ్మచారిణి దేవిగా దర్శనమివ్వడంతో భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి, ప్రత్యేక పూజలకు తరలివచ్చారు. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, సినీ హీరో శ్రీ విష్ణు పూజలు చేయగా, దీక్షితుల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అన్నమాచార్య సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు.