
అబ్దుల్లాపూర్ మెట్ అధికారుల నుంచి రూ. 20 లక్షల లంచం పట్టివేసిన ఏసీబీ
The story in brief
అబ్దుల్లాపూర్ మెట్ లో జాయింట్ ఇన్స్పక్షన్ సర్వే రిపోర్టు కోసం రూ. 20 లక్షల లంచం తీసుకుంటున్న ఇద్దరు రెవెన్యూ అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటున్న అంశంపై అబ్దుల్లాపూర్ మెట్ లో సంచలనం రేగింది. ఎంఆర్వో, మండల సర్వేయర్లను అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.