
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగింపు
The story in brief
ఎఫ్ఎంసిజి, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐటి షేర్లలో అమ్మకాల ఒత్తిడితో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 547.65 పాయింట్లు తగ్గి 71,924.68 వద్ద నిలిచింది. నిఫ్టీ 157.10 పాయింట్లు తగ్గి 22,363.35 వద్ద నిలిచింది. నిఫ్టీ 22,600 స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది. దీనితో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. నిఫ్టీ 22,200 దాటితే 22,000కు పడిపోవచ్చు. 22,500-22,600 దాటితే కోలుకోవచ్చు.