
శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ బంగారం పట్టుబడింది
The story in brief
తిరుచ్చి నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రయాణికుడి లోదుస్తుల్లో దాచిన 1481 గ్రాముల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కార్మన్ పేపర్లో చుట్టి, బ్లూ టేప్‌తో కప్పి ఉంచిన బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ చట్టం 1962 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.