
పలాసి గ్రామం దగ్గర చిరుతపులి కనిపించింది
The story in brief
పలాసి గ్రామం దగ్గర చిరుతపులి తిరుగుతూ కనిపించింది. ఆ గ్రామంలో నివసించే తౌటి రాములు తన పొలంలో చిరుతపులి పాదముద్రలు చూసి భయపడ్డాడు. దీంతో రైతులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రాత్రిపూట పొలాల్లో ఒంటరిగా తిరగడం మంచిది కాదని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజల భద్రత దృష్ట్యా చిరుతపులి కదలికలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.