
రక్తదాన శిబిరం సెయింట్ మేరీస్
The story in brief
సెయింట్ మేరీస్ సెంటెనరీ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, సికింద్రాబాద్ వారు శనివారం 'మానవత్వపు చుక్క...రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి' అనే అంశంపై స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు స్వచ్ఛంద రక్తదానం యొక్క ప్రాముఖ్యత, సామాజిక బాధ్యత గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఆంథోనీ వినయ్ పాల్గొన్నారు.