
వరకట్న కోరడంతో టాయిలెట్కు తాళం వేసిన అత్తమామలు
The story in brief
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భదోహికి చెందిన 20 ఏళ్ల షబ్నమ్ అనే యువతికి వరకట్నంగా రూ. 50 వేలు ఇవ్వకపోవడంతో అత్తమామలు టాయిలెట్కు తాళం వేసి బయటకు పంపేశారు. సెప్టెంబర్ ప్రారంభంలో అత్తమామలు ఆమె తండ్రి వద్ద డబ్బులు అడిగారు. దీంతో ఆమె వేధింపులకు గురైంది. సెప్టెంబర్ 27న షబ్నమ్ బాత్రూమ్ తలుపుకు తాళం వేసి ఉండటం చూసి, అత్తమామలను తలుపు తెరవమని అడిగినా వారు పట్టించుకోలేదు. ఆమె మామయ్య, కుటుంబ సభ్యులు ఆమెపై దాడి చేసి, పక్క ఇంటి టాయిలెట్ను ఉపయోగించేలా చేశారు. అనంతరం ఆమె వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.