
హుస్సేనాబాద్ సమీపంలో మైత్రీ ట్రావెల్స్ బస్సు బోల్తా
The story in brief
సూర్యాపేట జిల్లా మోతె మండలంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న మైత్రి ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.