
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర త్వరలో ప్రారంభం
The story in brief
ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 6 గంటలకు మండపం నుంచి ప్రారంభమవుతుంది. సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలుగు తల్లి చౌరస్తా, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ఊరేగింపు సాగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకుగాను నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. నిమజ్జనం కోసం లాంగ్ బూమ్ మెకానికల్ క్రేన్ సిద్ధమైంది. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పు ఉన్న విగ్రహాన్ని మధ్యాహ్నం వరకు నిమజ్జనం చేస్తారు. సాఫీగా తరలించేందుకు విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మలను కత్తిరించారు.