
ఆర్మూర్ లోని మైనారిటీ పాఠశాలల కోసం నిధులు కోరిన ఎమ్మెల్యే
The story in brief
ఆర్మూర్ నియోజకవర్గానికి తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజీలను మంజూరు చేయాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ను ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి కోరారు. హైదరాబాద్ సెక్రటేరియట్ లో మంత్రిని కలిసి నిధుల కోసం వినతి పత్రం అందజేశారు. నిధులు త్వరలో మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.