
161 మంది స్పోర్ట్స్ కోటా జెపిఎస్లకు 4 నెలల జీతం విడుదల చేసిన ప్రభుత్వం
The story in brief
స్పోర్ట్స్ కోటా కింద నియమితులైన 161 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు 4 నెలల జీతం బకాయిలు విడుదల చేసి ప్రభుత్వం ఊరట కల్పించింది. మార్చి నుంచి జూన్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ. 46,23,759లను వ్యక్తిగత ఖాతాల్లో జమ అయ్యేలా పంపిణీ చేయాలని కమిషనర్ డిపిఒలను ఆదేశించారు. ఇకపై డిపిఒలు నెలవారీ ఖర్చుల వివరాలను ప్రతి నెల 10వ తేదీలోగా కమిషనరేట్ కార్యాలయంలో సమర్పించాలి.