
విద్యుత్ కోతల మీద విద్యుత్ కార్యాలయం ముట్టడిలో రైతులు
The story in brief
యాదాద్రి జిల్లాలో విద్యుత్ కోతలు కొనసాగుతుండడంతో సబ్ స్టేషన్లు, విద్యుత్ కార్యాలయాలను రైతులు ముట్టడి చేస్తున్నారు. ప్రభుత్వ స్పందన లేకపోవడంపై బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటల ఉత్పత్తిని నియంత్రించేందుకే ప్రభుత్వం విద్యుత్ నిలిపివేస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే రైతులు నష్టపోతారని మాజీ ఎమ్మెల్యే కుసుమంతల ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.