
సుప్రీంకోర్టు జూబ్లీహిల్స్ సీఐకి స్వల్ప ఊరట
The story in brief
లైంగిక వేధింపుల ఆరోపణలపై సస్పెండ్ అయిన జూబ్లీహిల్స్ హెచ్‌విఓ, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డికి సుప్రీంకోర్టు స్వల్ప ఊరట ఇచ్చింది. తదుపరి విచారణ జరిగే వరకు అతన్ని అరెస్టు చేయకుండా సిటీ పోలీసులు చర్యలు తీసుకోకుండా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బలవంతపు చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. జస్టిస్ బివి నాగరత్న, ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించగా, తదుపరి విచారణలో తీర్పు వెలువడనుంది.