
నాగోల్ హత్య కేసులో మహేష్ ఇంకా పరారీలోనే ఉన్నాడు
The story in brief
2026 సెప్టెంబర్ 14న ఖమ్మం నుంచి ప్లాన్ వేసుకుని సుప్రీం వైన్స్ లో నయీంను ఒక ముఠా హత్య చేసింది. 8 మందిని అరెస్ట్ చేశాం. కీలకమైన మహేష్ పరారీలోనే ఉన్నాడని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి తెలిపారు. మహేష్ను ఎవరు రక్షిస్తున్నారు? ఎక్కడ దాక్కున్నారో స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వినాయక నవరాత్రి పండుగ జరుగుతున్నందున దృష్టి పెట్టలేకపోతున్నామని, త్వరలోనే పట్టుకుంటామని నాగోల్ పోలీసులు తెలిపారు.