
పాకిస్తాన్లో పెట్రోల్ ధర రూ. 400 దాటడంతో గాడిదలతో నిరసన తెలిపిన పీటీఐ నేతలు
The story in brief
పెట్రోల్ ధర లీటరుకు రూ. 400 దాటడంతో సింధ్ అసెంబ్లీకి గాడిద బండ్లపై విపక్ష నేతలు చేరుకున్నారు. పెరిగిన ధరల్లో మూడోవంతు పన్నులు, సుంకాలే ఉండటంతో వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరల పెరుగుదలను ప్రజలపై పెట్రోల్ బాంబుగా అభివర్ణిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీటీఐ నేత సజ్జాద్ అలీ సూమ్రో విమర్శలు చేశారు.