
చంద్ర సిద్ధార్థ 'ఈ పాట రేడియో కావాలనే వాళ్ల కోసమే...' చిత్రం సెప్టెంబర్ 1న థియేటర్స్ లోకి
The story in brief
చంద్ర సిద్ధార్థ కొత్త మిస్టికల్ మ్యూజికల్ థ్రిల్లర్ 'ఈ పాట రేడియో కావాలనే వాళ్ల కోసమే... (సబ్ టైటిల్: ఎ ఫర్బిడెన్ సాగా ఫ్రమ్ ఎ ఫర్బిడెన్ రాగ) చిత్రం సెప్టెంబర్ 1న థియేటర్స్ లోకి రానుంది. దివంగత దర్శకుడు మదన్ కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో హర్ష కథానాయకుడు కాగా, అమైరా గోస్వామి, సుజన రెడ్డి హీరోయిన్లుగా నటించారు. తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద టైటిల్ గా నిలిచిన ఈ చిత్రానికి విలక్షణమైన టైటిల్ ను హైలైట్ చేస్తూ అనిల్ రావిపూడి ఘనంగా ట్రైలర్ ను విడుదల చేశారు.