
తిరుమల కొండలపై మల్టీప్లెక్స్ థియేటర్ గా వివిఐపి కంపాట్మెంట్ ను పునరుద్ధరించిన టిటిడి
The story in brief
వివిఐపి సందర్శకుల కోసం ఆధునిక వసతులతో మల్టీప్లెక్స్ థియేటర్ ను పోలి ఉండే వివిఐపి కంపాట్మెంట్ ను తిరుమల తిరుపతి దేవస్థానం రూపొందించింది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 17వ కంపాట్మెంట్ లో ఇప్పుడు శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తి ఛానల్ ను ప్రసారం చేసే పెద్ద ఎల్ఈడీ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. ఈ సదుపాయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించగా, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ పరిశీలించారు.