
అమీర్ పేటలో రాపిడో బైక్ ప్రమాదంలో మహిళ మృతి
The story in brief
అమీర్ పేట-శ్రీనగర్ కాలనీలోని బిగ్ బజార్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో రాపిడో బైక్ పైనున్న మహిళ హేమదుర్గ అక్కడికక్కడే మృతి చెందింది. సెల్ ఫోన్ రిపేర్ కోసం అమీర్ పేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాపిడో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.