
మహేష్ శ్రీరామ్ 'కౌబాయ్ అండ్ ఇండియన్' ప్రపంచ విడుదలకి సిద్ధం
The story in brief
ఇంగ్లీష్ సినిమాలతో పేరుగాంచిన తెలుగు నటుడు మహేష్ శ్రీరామ్ తన హాలీవుడ్ చిత్రం 'కౌబాయ్ అండ్ ఇండియన్'ను శనివారం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఆయన విఎన్ ఆదిత్య దర్శకత్వంలో 'ఫణి'లో నటిస్తున్నారు. ఇందులో కేథరీన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఓఎంజీ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. ఏయూ అండ్ ఐ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. 'ఫణి' చిత్రాన్ని పలు భాషల్లో విడుదల చేయనున్నారు.